Asianet News TeluguAsianet News Telugu

53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదల.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు.. కానీ...

యావజ్జీవ శిక్ష పడిన  53 మంది మహిళల విడుదలకు జగన్ సర్కార్  ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే మళ్లీ నేరం చేస్తే విడుదల రద్దుచేస్తామని హెచ్చరించింది. విడుదల కోసం నగదు బాండును కోరింది. 

Andhra Pradesh government has issued orders for release of 53 women prisoners - bsb
Author
Hyderabad, First Published Nov 27, 2020, 12:51 PM IST

యావజ్జీవ శిక్ష పడిన  53 మంది మహిళల విడుదలకు జగన్ సర్కార్  ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే మళ్లీ నేరం చేస్తే విడుదల రద్దుచేస్తామని హెచ్చరించింది. విడుదల కోసం నగదు బాండును కోరింది. 

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27, విశాఖ నుంచి ఇద్దరు, నెల్లూరు నుంచి ఐదుగురు  ఖైదీల ముందస్తు విడుదలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 53 మంది మహిళా ఖైదీలకు జీవితఖైదు నుంచి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ వీరి విడుదలకు సిఫార్సు చేసింది.

అయితే మహిళా ఖైదీల ముందస్తు రిలీజ్‌కు గవర్నమెంట్ కొన్ని కండీషన్స్ పెట్టింది. విడుదలయ్యే ఖైదీలు 50 వేల రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విడుదలైన తర్వాత కూడా శిక్షా కాలం పూర్తయ్యే వరకు ప్రతి మూడు నెలలకోసారి స్థానిక పోలీసు స్టేషన్‌లో అధికారి ముందు హాజరు కావాలని తెలిపారు. 

అంతేకాదు మరోసారి నేరానికి పాల్పడితే తక్షణమే అరెస్ట్ చేసి ముందస్తు విడుదల రద్దు చేస్తామని గవర్నమెంట్ స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios