Asianet News TeluguAsianet News Telugu

రూల్స్ బ్రేక్: ఏపీలో మరో 4 కోవిడ్ సెంటర్ల అనుమతి రద్దు

నిబంధనలు పాటించని మరో నాలుగు కోవిడ్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ నాలుగు కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసింది.

Andhra pradesh government abolish another 4 covid centers permission
Author
Amaravathi, First Published Aug 28, 2020, 10:36 AM IST

అమరావతి: నిబంధనలు పాటించని మరో నాలుగు కోవిడ్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ నాలుగు కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసింది.

ఎలైట్ అడ్వాన్స్ కోవిడ్ 19 సెంటర్ (పాలి క్లినిక్ రోడ్), సాయి మాధవి కోవిడ్ సెంటర్, అనిల్ న్యూరో అండ్ ట్రామ్ కోవిడ్ సెంటర్, బిఎస్ శ్రీరామ్ ఆసుపత్రి(శశి ప్యారడైజ్) అనుమతులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.గతంలోనే ఐదు కోవిడ్ సెంటర్ల అనుమతిని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

also read:24 గంటల్లో కరోనాతో 92 మంది మృతి: ఏపీలో 4 లక్షలకు చేరువలో కేసులు

ఈ నెల 10వ తేదీన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

also read అధిక ఫీజులు: విజయవాడలో 5 ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల అనుమతులు రద్దు

ఈ సమయంలోనే ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండానే చాలా ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్లను నిర్వహిస్తున్న విషయం తేలింది. దీంతో ప్రభుత్వం కోవిడ్ సెంటర్లపై  అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరో వైపు రోగుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడ అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన సెంటర్లపై విచారణ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకొంది. రాష్ట్రంలోని 9 కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios