Asianet News Telugu

కర్నూలు ఆత్మహత్యలు : మమ్మల్ని క్షమించండి.. సూసైడ్ నోట్ రాసి మరీ..

ప్రతాప్ వద్ద సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, మానసిక బాధ తోనే ఆత్మహత్య చేసుకుంటున్నామని అందులో ఉంది. తనకు అప్పులు లేవని, ఎవరికీ ఎవరూ అప్పు లేరని మిత్రులు, బంధువులు తమను క్షమించాలని రాసుకున్నారు.

Andhra Pradesh : Four of family die by suicide in Kurnool, letter found - bsb
Author
Hyderabad, First Published Jun 24, 2021, 3:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయడంలో ముందుండే మనిషి, చుట్టుపక్కల వారితో సఖ్యత గా ఉండే కుటుంబం.  ఎవరితో ఏ గొడవలు లేవు.  ఆర్థిక సమస్యలూ లేవు. అనూహ్యంగా అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూల్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కడక్‌పురకు చెందిన ప్రతాప్ (42),  ఆయన భార్య హేమలత (36), కొడుకు జయంతి (17), కూతురు రిషిత (13) ఆత్మహత్య చేసుకున్నారు.  వీరు నలుగురు మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా, బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వెలుగులోకి వచ్చింది.

కర్నూల్ లోని కడక్‌పురలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బంధుమిత్రులు తెలిపిన సమాచారం మేరకు కడక్‌పురకు చెందిన ప్రతాప్ స్థానికంగా టీవీ మెకానిక్ గా పని చేసేవాడు. కాలనీలో సొంత ఇంటి రెండో అంతస్తులో వీరి కుటుంబం ఉంటుంది.  గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులలో సోదరులు ఇద్దరు ఉంటున్నారు.

ప్రతాప్ కుటుంబం మంగళవారం రాత్రి వరకు అందరితో కలివిడిగా ఉండిందని, అందరినీ పలకరించి సరదాగా గడిపారని స్థానికులు చెబుతున్నారు.  పై అంతస్తులో ఉన్న వాటర్ ట్యాంక్ నిండి, నీళ్లు కిందికి పోతుండడంతో గమనించిన కింది అంతస్తులోని సోదరుడు, మోటార్ ఆఫ్ చేయమని చెప్పేందుకు ప్రతాప్ కు ఫోన్ చేశాడు.

ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో పైకి వెళ్ళాడు.  ఇంట్లో నుంచి టీవీ శబ్దం వినిపించింది. పిలిచినా ఎవరూ పలకకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపులు పగలగొట్టాడు. లోపలికి వెళ్లి చూస్తే ప్రతాప్, అతని భార్య, పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే సోదరుడు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వన్ టౌన్ సీఐ వెంకటరమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల పక్కన చెక్కెర డబ్బా, పాల గ్లాసులు కనిపించాయి. పాలల్లో విషం కలుపుకుని తాగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కర్నూల్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య...

అయితే ప్రతాప్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతాప్ తల్లిదండ్రులు ఏడాది క్రితం అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు. నెల క్రితం ఆయన మిత్రుడు కూడా అనారోగ్యంతో మృతి చెందాడని సమాచారం.  కొన్ని రోజుల క్రితం ప్రతాప్  సోదరుడి భార్య కూడా అనారోగ్యంతో మృతి చెందింది. 

ఆమె కర్మకాండలను ప్రతాప్ దగ్గరుండి పూర్తి చేయించాలని స్థానికులు చెబుతున్నారు.  ఈ నలుగురు మరణం కారణంగా ప్రతాప్ మానసిక వేదనకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏ చెడు అలవాటు లేని ప్రతాప్  అందరితో కలిసి మెలిసి ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు.

ఎవరికీ ఏ సహాయం అవసరమైన ముందుండేవాడు అని గుర్తు చేసుకుంటున్నారు. ప్రతాప్ కొడుకు బృందావన్ కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా, కూతురు రిషిత విద్యానగర్ మాంటిసోరి స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్నారు. ఇటీవలే  ప్రతాప్ రూ. 30 లక్షలు పెట్టి ఒక స్థలాన్ని కూడా  కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఒక్కసారిగా అందరూ ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం రథ మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడని అనుమానిస్తున్నారు ఈ కారణంగానే ముందుగా భార్య పిల్లలకు పాలల్లో విషం కలిపి ఇచ్చాడని ఎవరు చనిపోయారు అని తెలుసుకున్న తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

ప్రతాప్ వద్ద సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, మానసిక బాధ తోనే ఆత్మహత్య చేసుకుంటున్నామని అందులో ఉంది. తనకు అప్పులు లేవని, ఎవరికీ ఎవరూ అప్పు లేరని మిత్రులు, బంధువులు తమను క్షమించాలని రాసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పోలీసులు బంధువులకు అప్పగించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటరమణ తెలిపారు 

Follow Us:
Download App:
  • android
  • ios