ముందుగా ఉదయం 10 గంటల నుంచి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మొదలయ్యింది. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అభ్యర్థుల జాబితా ప్రకటనతో పాటు.. ఎన్నికైన సభ్యులను మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ప్రకటిస్తారు. ఆ తరువాత ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఎంపీటీసీ, కో ఆఫ్షన్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీపీ ఎన్నికలకు(MPP chiefs) ఎన్నికల కమిషన్ (Election Commission)సర్వం సిద్ధం చేసింది. మరికొద్ది గంటల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే అధికారులను నియమించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. చేతులు ఎత్తే విధానం ద్వారా ఎంపీపీలను ఎన్నుకోనున్నారు.
ముందుగా ఉదయం 10 గంటల నుంచి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మొదలయ్యింది. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అభ్యర్థుల జాబితా ప్రకటనతో పాటు.. ఎన్నికైన సభ్యులను మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ప్రకటిస్తారు. ఆ తరువాత ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఎంపీటీసీ, కో ఆఫ్షన్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
మద్యాహ్నం మూడు గంటల నుంచి అన్ని మండల పరిషత్తులలోనూ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఆ తరువాత మండల పరిషత్ ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎంపీపీ, వైస్ ఎంపీపీ కోసం పోటీపడే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారు.
చేతులు ఎత్తే విధానం ద్వారా ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఎన్నికలు జరిగి ఫలితాలు పూర్తిగా ప్రకటించిన అన్ని మండలాల్లోనూ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిర్వహిస్తారు. మరోవైపు ఏదైనా కారణాల వల్ల ఎక్కడైనా ఎంపీపీ, వైస్ ఎంపీపీ జరగకపోతే మరుసటి రోజు వాటికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
విశాఖలో కరోనా కలకలం: జి,మాడుగుల రెసిడెన్షియల్ స్కూల్‌లో 19 మంది విద్యార్ధులకు కోవిడ్
సగం మంది ఎంపీటీసీలు కోరంగా హాజరైతేనే ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతీ మండలానికి ఒక ప్రిసైడింగ్ అధికారిని నియమించారు. ఎంపీపీల ఎన్నికలను ఎమ్మెల్యేలు ఆహ్వానితులుగా మాత్రమే ఉంటారు. ఎటువంటి ఓటు హక్కు ఉండదు.
ఎంపీపీ ఎన్నికల అనంతరం రేపు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ముందుగా జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహిస్తారు. ఆ తరువాత ప్రత్యేక సమావేశంలో జెడ్సీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ సారి ఇద్దరు వైస్ చైర్మన్ లను ఎన్నుకునేందుకు ప్రభుత్వం ఇటీవలే చట్ట సవరణ చేపట్టింది.
