విశాఖలో కరోనా కలకలం: జి,మాడుగుల రెసిడెన్షియల్ స్కూల్‌లో 19 మంది విద్యార్ధులకు కోవిడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో ఇటీవల కాలంలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. తాజాగా విశాఖ ఆశ్రమ పాఠశాలలో 19 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో రెసిడెన్షియల్ స్కూల్ కి అధికారులు సెలవు ప్రకటించారు. స్కూల్ లోని ఇతర విద్యార్ధులకు కూడా పరీక్షలు నిర్వహించారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణం (visakhapatnam) జిల్లాలోని జి. మాడుగుల (G.Madugula residential school) ఆశ్రమ పాఠశాలలో కరోనా (corona virus) కలకలం సృష్టించింది. ఆశ్రమ పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్ధులకు కరోనా సోకింది.ఆంధ్రప్రదేశ్(andhra pradesh) రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను తెరిచింది. అయితే కరోనా ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కరోనా ప్రోటోకాల్స్ పాటించినా కూడ కొన్ని స్కూల్స్,ఆశ్రమ పాఠశాలల్లో కరోనా వైరస్ కేసులు నమోదౌతున్నాయి.
జి. మాడుగుల ఆశ్రమ పాఠశాలలోని 19 మంది విద్యార్ధులకు కరోనా సోకడంపై విద్యార్ధుల పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు. 19 మంది విద్యార్ధులకు కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆశ్రమ పాఠశాలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. వారందరిని ఐసోలేషన్ కు తరలించారు. మరో వైపు ఈ ఆశ్రమ పాఠశాలలోని ఇతర విద్యార్ధులకు కూడా పరీక్షలు నిర్వహించారు.