కరోనా పరీక్షల్లో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్: జాతీయ స్థాయిలో రికార్డు
కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది. వైద్య పరీక్షల్లో 10 లక్షల మార్క్‌ను దాటింది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కోవిడ్ 19 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు
కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది. వైద్య పరీక్షల్లో 10 లక్షల మార్క్‌ను దాటింది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కోవిడ్ 19 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
గడిచిన 24 గంటల్లో 20,567 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 961 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కోవిడ్ సోకింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 10 లక్షల మందిలో 19,047 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. జాతీయస్థాయిలో ప్రతి మిలియన్‌కు 6,578 మందికి పరీక్షలు చేశారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 1.24 శాతం.. ఏపీ వ్యాప్తంగా 78 చోట్ల కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించారు.
ఫిబ్రవరి 1న ఏపీ నుంచి గాంధీ ఆసుపత్రికి తొలి శాంపిల్ వచ్చింది. మార్చి 7న తిరుపతి స్విమ్స్‌లో తొలి కరోనా పరీక్ష చేశారు. కాగా ఏపీలో ఆదివారం నాటికి కరోనా కేసులు సంఖ్య 18,697కి పెరిగింది.
గడిచిన 24 గంటల్లో 14 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 232కి చేరింది. గత 24 గంటల్లో 391 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య 8,422కు చేరుకోగా, మరో 10,043 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.