BLACK BALLOONS: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప‌ర్య‌ట‌నను నిర‌సిస్తూ.. ఏపీలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో నల్ల బెలూన్లు ఎగ‌ర‌వేసి విష‌యం తెలిసిందే.. ఈ విష‌యంలో అరెస్ట్ అయినా..  కాంగ్రెస్ నాయకులు రాజీవ్ రతన్, రవి లకు గురువారం రాత్రి స్టేషన్ బెయిల్ మంజూరు అయ్యింది

BLACK BALLOONS: ప్రధానమంత్రి పర్యటనను నిరసిస్తూ.. ఏపీలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు నల్ల బెలూన్లు ఎగరవేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో అరెస్టయినా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ రతన్, రవి లకు గురువారం రాత్రి స్టేషన్ బెయిల్ మంజూరు అయ్యింది. 

ఈ సందర్భంగా రాజీవ్ రతన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి పర్యటనలో చాలా చోట్ల నిరసన తెలియజేశారనీ, ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో నల్ల బెలూన్లు ఎగరవేస్తే నిరసనలో తాను లేన‌ని అన్నారు. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ కావాల‌నే త‌నపై అస‌త్య క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేశాయ‌ని ఆరోపించారు. ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేద‌ని అన్నారు.

ప్రధానమంత్రి భీమవరం వెళ్లే సమయంలో.. తాను కాంగ్రెస్ ప్ర‌ధాన‌ పార్టీ కార్యాలయంలో ఉన్నాననీ, త‌న వ‌ద్ద పూర్తి ఆధారాలున్నాయ‌ని అన్నారు. త‌న మొబైల్ ఫోన్ లో అందుకు సంబంధించిన ఆధారాలున్నాయ‌నీ, కానీ త‌న మొబైల్ పోలీసుల ఆధీనంలోనే ఉంద‌ని, త‌న ఫోన్ త‌న చేతికి వ‌స్తే.. అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. కాంగ్రెస్ నేతలు కేవలం నిరసన మాత్రమే తెలియజేశారు. న‌ల్ల‌బెలూన్లు ఎగ‌ర‌వేయ‌డంతో వేరే ఉద్దేశమేమి లేద‌ని తెలిపారు.

ఈ నెల 4న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పర్యటనను నిర‌సిస్తూ.. ఆంధ్ర‌ కాంగ్రెస్ నాయ‌కులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇందులో భాగంగా.. కొంత‌మంతి కాంగ్రెస్ నాయ‌కులు గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో నల్ల బెలూన్లు ఎగరవేసిన నిర‌స‌న తెలిపారు. 

ప్ర‌ధాని హెలికాఫ్టర్‌ ముందు నల్ల బెలూన్‌లు ఎగరవేయడాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విష‌యాన్నిప్రధాని భద్రతా పరంగా ఎస్‌పీజీ అధికారులు కూడా చాలా సీరియస్‌గా పరిగణించారు. ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ అధికారుల నిఘా వైఫల్యం కార‌ణంగా ఈ చ‌ర్య‌ జ‌రిగింద‌ని పోలీస్‌ ఉన్నతాధికారులు అన్నారు.