విశాఖలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేత: విచారణకు సీఎం జగన్ ఆదేశం
విశాఖపట్టణంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని సీఎం డీజీపీని కోరారు.
అమరావతి: విశాఖ పట్టణంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించాలని డీజీపీ గౌతం సవాంగ్ ను ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jagan బుధవారం నాడుSharada peeth వార్షికోత్సవంలో పాల్గొనేందుకు Visakhapatnam వచ్చారు. అయితే సీఎం జగన్ విశాఖపట్టణం పర్యటనను పురస్కరించుకొని గంటల తరబడి Traffic ను నిలిపివేశారు.ట్రాఫిక్ నిలిపివేతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా సీఎం జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని కూడా సీఎం ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కల్గించినందుకు చింతిస్తున్నట్టుగా సీఎం జగన్ పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు గాను బుధశారం నాడు ఉదయం 11 గంటలకు విశాఖపట్టణం Airport చేరుకోవాల్సి ఉండగా ఉదయం 11:45 గంటలకు విమానాశ్రయానికి చేరుకొన్నారు. మధ్యాహ్నం 1 గంటలకు తిరిగి గన్నవరం బయలుదేరాల్సి ఉంది. అయితే సీఎం జగన్ సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉన్నారు. దీంతో సీఎం జగన్ ఎప్పుడు తిరిగి వెళ్తారో స్పష్టత లేకపోవడంతో విశాఖపట్టణంలో గంటల తరబడి ట్రాఫిక్ ను నిలిపివేశారు. రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం వెళ్లేవారు కాలినడకన తమ గమ్యాలకు చేరుకొన్నారు. ఆసుపత్రులకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. ఎయిర్ పోర్టులకు వెళ్లేవారు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎన్నడూ కూడా ఈ తరహలో ట్రాఫిక్ ను నిలిపివేయలేదు. కానీ గంటల తరబడి ట్రాఫిక్ ను ఎందుకు నిలిపివేశారని ప్రజలు ట్రాఫిక్ పోలీసులను నిలదీశారు. రోడ్లపైనే వాహనాలు ఎర్రటి ఎండలో నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.