Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కి సీఎం శంకుస్థాపన

వైయస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌  శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు. వీడియో లింక్‌ ద్వారా  సీఎం శంకుస్థాపన చేశారు.
 

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy launches Vedadri lift scheme works
Author
Amaravathi, First Published Aug 28, 2020, 1:19 PM IST


అమరావతి: వైయస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌  శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు. వీడియో లింక్‌ ద్వారా  సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో వేదాద్రి నుంచి మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, పేర్నినాని, కొడాలినాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్‌  ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సీఎం జగన్ ప్రసంగించారు. విజయవాడకు అతిసమీపంలోని కృష్ణాజిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి ఉందన్నారు. 

5 ఏళ్లపాటు అధికారంలో ఉండికూడా ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 
మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వనుంచి ఈప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు.. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తామని సీఎం చెప్పారు.

డీబీఆర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని 30 గ్రామాలతోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైయస్సార్‌ వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ద్వారా నీరు అందిస్తామన్నారు.
దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 490 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios