రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్: ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీకి చాన్స్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇతర విషయాలపై జగన్ చర్చించే అవకాశం ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jagan ఈ నెల 2వ తేదీన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రధానమంత్రి Narendra Modi, కేంద్ర మంత్రి Amit Shah ను కలిసే చాన్స్ ఉంది.వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల క్రితమే amaravathiకి వచ్చారు. ఈ నెల 2న సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారని సమాచారం. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులతో పాటు థావోస్ పర్యటన విశేషాలపై కూడా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై కూడా ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ,Telangana రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న వివాదాల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరనున్నారు.
also read:వైసీపీ పాలనకు మూడేళ్లు... జగన్ స్పెషల్ ట్వీట్...!
ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన Andhra Pradesh CM వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విభజన హామీ చట్టంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన బకాయిల చెల్లింపు తదితర వాటిపై సీఎం జగన్ చర్చించారు.