40 వేల మందికి ఉపాధి: విశాఖలో డేటా సెంటర్ కు జగన్ శంకుస్థాపన

విశాఖపట్టణంలో  అదానీ డేటా సెంటర్ కు  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ  శంకుస్థాపన చేశారు.  
 

Andhra Pradesh CM YS Jagan lays Foundation stone for Integrated data center in visakhapatnam lns

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో ఇంటిగ్రేటేడ్  డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్ లకు ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారంనాడు శంకుస్థాపన  చేశారు.300 మెగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్ ను విశాఖపట్టణంలో అదానీ గ్రూప్ ఏర్పాటు  చేయనుంది.  ేపీ రాష్ట్రంలో అదానీ గ్రూప్  రూ.21,844 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.   ఈ సందర్భంగా  నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. 

విశాఖపట్టణానికి  డేటా సెంటర్ రావడం చాలా ఆనందంగా  ఉందని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.  ప్రగతి పథంలో  విశాఖ  పట్టణం దూసుకుపోవడానికి డేటా సెంటర్ దోహదపడనుందన్నారు.  విశాఖపట్టణం  డేటా సెంటర్ తో  40 వేల మందికి ఉద్యోగాలు దొరకుతాయన్నారు.  డేటా సెంటర్ తో విశాఖ సిటీ  టియర్-1 సిటీ మారనుందని  ఆయన  చెప్పారు.  విశాఖకు  ఇది గొప్ప ప్రోత్సాహకరంగా మారనుందని సీఎం జగన్ తెలిపారు.  

also read:ప్రజల ఆశీస్సులున్నంతవరకు ఏమీ చేయలేరు: భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన

ఇంత పెద్ద డేటా సెంటర్  దేశంలో ఎక్కడా లేదని  సీఎం జగన్ చెప్పారు.   ఈ డేటా సెంటర్ తో  ఇంటర్ నెట్  డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుందన్నారు.  ఈ డేటా సెంటర్  గ్రీన్ డేటా సెంటర్ అని  సీఎం వివరించారు.  విశాఖలో డేటా సెంటర్  ఏర్పాటు  చేసేందుకు ముందుకు వచ్చిన అదానీ గ్రూప్ నకు  సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios