ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. ఇక, కేబినెట్ భేటీలో పలు కీలకాంశాలు చర్చించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ జరగనుంది. గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. ఇక, కేబినెట్ భేటీలో పలు కీలకాంశాలు చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై కూడా సీఎం జగన్ కొత్త మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఇక, గత నెల 7వ తేదీన ఏపీ కేబినెట్ చివరి భేటీ జరిగింది. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అనంతరం అప్పడున్న మంత్రుల అందరూ వారి రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఆ తర్వాత కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణ చేపట్టిన సీఎం జగన్.. పాత వారిలో 11 మందికి మరోసారి మంత్రులుగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. 

ఇక, కొత్త మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు కూడా చేపడుతున్నారు. అయితే కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొందరు మంత్రులు చేస్తున్న కామెంట్స్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో 13వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీలో ఇకపై అలాంటివి చోటుచేసుకోకుండా సీఎం జగన్ కొత్త మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.