ఆంధ్రప్రదేశ్‌లో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం అధికారులతో వీడియో కాన్షరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్‌ అధికారుల పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం అధికారులతో వీడియో కాన్షరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్‌ అధికారుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని.. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. . వచ్చే 48 గంటల్లో వరదబాధిత కుటుంబాలకు రూ.2వేలు, రేషన్‌ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 

వచ్చే 48 గంటల్లో ఏ ఇళ్లు మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలని సీఎం జగన్ అన్నారు. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు,కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్ అందజేయాలని చెప్పారు. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో రూ. 2 వేలు, రేషన్ పంపిణీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. 

గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదని సీఎం జగన్ అన్నారు. పటిష్టమైన వ్యవస్థతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టుగా చెప్పారు. అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి.. చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్‌ వంటివారు బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని అన్నారు. 

పునరావాస శిబిరాల్లో ఆహారం, నీరు అందించడటంతో పాటు.. పారిశుద్ధ్యం ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలని ఆదేశించారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలని చెప్పారు. గర్బిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. వారిని ఆస్పత్రులకు తరలించాలని సూచించారు.