Asianet News TeluguAsianet News Telugu

బీఫార్మసీ విద్యార్థిని మృతి కేసు‌: దిశా పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసిన ఉన్నతాధికారులు..

శ్రీసత్య సాయి జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. విద్యార్థినిపై అత్యాచారం జరిపి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Andhra Pradesh BPharmacy student death case Inquiry transfers to disha Police station
Author
Anantapur, First Published May 9, 2022, 10:45 AM IST | Last Updated May 9, 2022, 1:09 PM IST

శ్రీసత్య సాయి జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. విద్యార్థినిపై అత్యాచారం జరిపి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోస్టుమార్టమ్ నివేదికల ప్రకారం విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థిని మృతిపై కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసును పోలీసులు.. దిశా పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని దిశా డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ రాహుల్ ఆదేశించారు. ఈ క్రమంలోనే నేడు గోరంట్లలో శ్రీనివాసులు విచారణ నిర్వహించనున్నారు.

ఇక, తొలుత తేజస్వినిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు.. తాజాగా నిందితుడిగా ఉన్న సాదిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని ధర్మవరం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. 

బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మే 4వ తేదీన  గోరంట్ల సమీపంలోని తన ప్రేమికుడు సాదిక్ వ్యవసాయ భూమిలోని షెడ్డులో అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె షెడ్డులో ఉరి వేసుకుని మృతిచెందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆత్మహత్యగా కేసు నమోదు చేయగా.. మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రమే సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు సాదిక్‌ను అరెస్ట్ చేశారు. 

తేజస్విని, సాదిక్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ధర్మవరం డీఎస్పీ చెప్పారు. బాలికను సాదిక్ తన వ్యవసాయ భూమికి తీసుకెళ్లాడని.. ఇద్దరూ అక్కడ ఉన్న షెడ్ వద్ద రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారని చెప్పారు. ఆ తర్వాత సాదిక్ ఇద్దరికీ భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్లగా.. కి తేజస్విని షెడ్డు వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. అయితే తేజస్విని కుటుంబ సభ్యులు మాత్రం అత్యాచారం చేసి, హత్య చేశారని ఆరోపిస్తున్నారు. 

కుటుంబ సభ్యుల అనుమానం, రాజకీయ విమర్శల నేపథ్యంలో.. తేజస్విని మృతదేహానికి శుక్రవారం పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత తేజస్వినిది ఆత్మహత్యేనని, అత్యాచారం, హత్య జరిగిన దాఖలాలు లేవని డాక్టర్లు చెప్పారు. మృతురాలు మెడపై గాయం గుర్తులు ఉన్నాయని చెప్పారు. శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కూడా వైద్యులు చెప్పిన విషయాన్ని ధ్రువీకరించారు. 

అయితే కుటుంబ సభ్యులు మాత్రం నిష్పాక్షంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తేజస్విని కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ, జనసేన సహా పలు ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తేజస్విని కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చేలా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఆందోళనకారులు ఎస్పీ వాహనాన్ని ముందుకు కదలనిచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios