విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 మంది శాసనసభ్యుల్లో 13 మంది శ్రీనివాసులు ఉన్నారు. కొద్దిపాటి తేడాతో శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. శ్రీనివాసుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవమనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే శ్రీవారి పేరు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. 

తల్లిదండ్రులు తమ పిల్లలకు దైవనామానాలు పెట్టుకోవడం పరిపాటి. వాటిలో శ్రీనివాస్, శ్రీను, వెంకటేశ్వర్లు, వెంకటేష్, రాము, విష్ణు అనేవి విరివిగా పెట్టుకునే పేర్లు. తిరుమల శ్రీవారిని శ్రీనివాసుడు అని కూడా పిలుస్తారు. 

కొన్ని పేర్లు మగ, ఆడ పిల్లలకు పెట్టుకోవడానికి వీలుంటుంది. రాము, రాములమ్మ అలాంటివి. అయితే, శ్రీనివాసు అనే పేరు ఆడ పిల్లలకు పెట్టుకోవడానికి కుదరదు. అందుకే ఎపి శాసనసభలో శ్రీనివాస్ అనే పేరు గలవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

శ్రీనివాస్ అనే పేర్లు గల ఎమ్మెల్యేలు వీరేద..

1. కె. శ్రీనివాస రావు (ఎస్. కోట)
2. ముత్తసెట్టి (అవంతి) శ్రీనివాస రావు (భిమిలీ)
3. గంటా శ్రీనివాస రావు (విశాఖ నార్త్)
4. సిహెచ్. శ్రీనివాస్ ( రామచంద్రాపురం)
5. జి. శ్రీనివాస నాయుడు (నిడదవోలు)
6. గ్రంథి శ్రీనివాస్ (భీమవరం)
7. పి. శ్రీనివాస రావు (ఉంగుటూరు)
8. ఆళ్ల కాలి కృష్ణ శ్రీనివాస్ (ఏలూరు)
9. వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ వెస్ట్)
10. డా. జి. శ్రీనివాస్ రెడ్డి (నర్సారావుపేట)
11. బాలినేని శ్రీనివాస రెడ్డి (ఒంగోలు)
12. కె. శ్రీనివాసులు (కోడూరు)
13. అరణి శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాసులు (చిత్తూరు)