అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్ని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంసిద్దం అయ్యాయి. చాలారోజులుగా సుదీర్ఘ కసరత్తు చేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల ఎంపికను పూర్తిచేసాయి పొలిటికల్ పార్టీలు. ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటన పూర్తవడంతో కొందరు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇలా ఎన్నికలకు పార్టీలన్ని సిద్దమైన వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, మే 13న పోలింగ్ జరపనున్నట్లు ఈసి ప్రకటించింది. అభ్యర్థుల నామినేషన్ల గడువు ఏప్రిల్ 25.... నామినేషన్ల స్క్రూటినీ ఏప్రిల్ 26, నామినేషన్ల ఉపసంహరణ చివరితేదీ ఏప్రిల్ 29. ఎన్నికల కమీషన్ ప్రకటనతో ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ తో పాటే మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Lok Sabha Election Schedule 2024 : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఇదే...
ప్రస్తుత లోక్ సభతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలోనే గడువు ముగియనుంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించిన ఈసీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి పలు విడతల్లో ఎన్నికలకు సిద్దమయ్యింది. జూన్ 16 తో ప్రస్తుత లోక్ సభ గడువు ముగియనుంది. ఆలోపు ఎన్నికలను నిర్వహించేందకు ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఈ మేరకు ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.
ఎలక్షన్ షెడ్యూల్ :


