ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి శుక్రవారం ఉదయం సమావేశం అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాకులో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి శుక్రవారం ఉదయం సమావేశం అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాకులో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఉదయం 10.15 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయానికి మండలిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి బడ్జెట్ చదవనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన వెంటనే శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు.
ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఉదయమే సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు ఉంటాయన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను నిధులు కేటాయించం అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకిచ్చిన హామీల అమలు దిశగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు.
ఇక, ఈసారి రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లకు పైగానే ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నవరత్నాల పేరుతో అమలు చేసే సంక్షేమ పథకాలకే ఎక్కువ కేటాయింపులు జరిపే అవకాశముంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున సంక్షేమానికే పెద్దపేట వేయనున్నారు. వీటితో పాటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలే కాకుండా కొత్తవాటికి ఏమైనా కేటాయింపులు చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయాల్సి ఉన్నందున దానికి సంబంధించిన కేటాయింపులను కూడా పెంచాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పధకాలపై ఎక్కువగా కొనసాగింపు ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.22 శాతం జీఎస్డీపీ వృద్ధి సాధించగా.. మూడేళ్ళుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. ఉద్యోగులకు సైతం ఒకేసారి 5 డీఏలు విడుదల చేయడం , 11 వ పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం.
అలాగే గతేడాది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కోవిడ్ పూర్వ స్థితికి చేరుకోవడంతో పాటు తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి 2,04,758 రూపాయలకు చేరింది. నవరత్నాల అమలు ద్వారా మానవ, ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, బాలామృతం అమలు, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలలో 13,500 ఆర్థిక సహాయం అందిస్తోంది జగన్ ప్రభుత్వం .
