ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద బొలెరో వాహనం ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, ఐదుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలు ఉన్నవారిని కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
