ప్రదీప్ టీ తాగేందుకు  కొర్లాం వద్ద ఓ టీ దుకాణం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఓ టీ దుకాణానికి సమీపంలో మూత్రవిసర్జన చేశాడు. 

బొమ్మ తుపాకీ చేతపట్టి ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అందరినీ కాల్చేస్తానంటూ ఓ హోటల్ యజమాని సహా.. అక్కడ ఉన్న కస్టమర్స్ ని కూడా హడలెత్తించాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళలం జిల్లా సోంపేటలోని కొర్లాంలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. జయపురం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న బస్సులో నుంచి దిగిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అతని పేరు ప్రదీప్ ష్వైన్ గా గుర్తించారు. అతను ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.

ప్రదీప్ టీ తాగేందుకు కొర్లాం వద్ద ఓ టీ దుకాణం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఓ టీ దుకాణానికి సమీపంలో మూత్రవిసర్జన చేశాడు. దీంతో.. అక్కడ అలా చేయవద్దంటూ టీ దుకాణం యజమాని అతనిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

తాను ఎమ్మెల్యే గన్ మెన్ అంటూ చెప్పి.. తన దగ్గర ఉన్న బొమ్మ తుపాకీని యజమాని తలకు గురిపెట్టి అక్కడి వారందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

కాగా.. నిందితుడు స్టంట్ మాస్టర్ గా పనిచేస్తాడని.. అతనికి మతిస్థిమితం సరిగాలేదని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.