సంక్రాంతి సంబరాల్లో మూడో రోజైన కనుమ అంటేనే పశువుల పండుగ. అలాంటి పండుగకు ప్రసిద్ధి చిత్తూరు జిల్లాలోని పుల్లయ్యగారిపల్లె. ఆంధ్రా జల్లికట్టుగా పిలిచే ఈ పశువుల పండుగను అక్కడి రైతులు వైభవంగా నిర్వహిస్తున్నారు.  

కరోనా నేపథ్యంలో ఈ సారి పోలీసుల ఆంక్షల మధ్య పుల్లయ్యగారిపల్లెలో పశువుల పండుగ కొనసాగుతోంది. పశువులకు కట్టిన చెక్క పలకలు సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు.

పశువుల కొమ్ములు వంచి పలకల కోసం ప్రయత్నించారు.చిత్తూరు జిల్లాతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి యువకులు భారీగా తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

జనం భారీగా తరలిరావడంతో పుల్లయ్యగారిపల్లె జనసంద్రంగా మారింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో కూడా పశువుల పండుగ ఘనం నిర్వహించారు.