జాతీయ రైతు దినోత్సవాన్ని వైఎస్సార్ జయంతి రోజుకు మార్చడం దారుణం అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకు పడ్డారు. వ్యవసాయ రుణాలు అందించి, కౌలు రైతుల హక్కులు కాపాడేందుకు చట్టం తెచ్చిన రైతుబంధు చరణ్‌సింగ్ గారి జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరపడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.

అంతేకాదు, నాటి పాలకులు రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సంస్కరణలు తీసుకొస్తే నేడు రైతుల పాలిట రాబందుగా మారిన జగన్ రెడ్డి రైతుల భవిష్యత్తు అంధకారం చేసేందుకు మీటర్లు బిగిస్తున్నాడంటూ ఎద్దేవా చేశాడు.
జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వలన రోజుకో అన్నదాత ఆత్మహత్యకి పాల్పడటం ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఒకపక్క పొలంలో రైతు సాయం కోసం ఎదురుచూస్తుంటే మన వ్యవసాయశాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడని చురకలంటించారు.
కట్టేవి కూలగొట్టడం.. వీలుకాపోతే రంగులేయడం, అదీ సాధ్యం కాకపోతే స్టిక్కర్లు అంటించడం మాత్రమే జగన్‌రెడ్డి తెలిసని... అందుకే చరణ్‌సింగ్ జయంతి రోజున జరగాల్సిన రైతు దినోత్సవాన్ని కూడా తన తండ్రి వైఎస్ జయంతికి మార్చుకున్నాడని మండిపడ్డారు.
రైతులు ఆత్మస్తైర్యంతో ఉండాలి, నియంత జగన్ రెడ్డి కొమ్ములు వంచి మీకు న్యాయం జరిగేలా పోరాడటానికి నేను మీ ముందు ఉంటాను. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా రైతన్నలకు అండగా నిలబడుతుంది, పోరాడుతుందని హామీ ఇచ్చారు.
చివరగా దేశ సమైక్యతకు ఆయువుపట్టుగా నిలుస్తున్న మా అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 23, 2020, 10:13 AM IST