Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో ఇక నో రిక్రూట్ మెంట్

  • ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్న టిడిపి ఎన్నికల నినాదానికి అర్ధం అందరికీ ఇప్పుడే అర్ధమవుతోంది.
  • తెలుగుయువత, టిడిపిలోని యువతను ఔట్ సోర్సింగ్ పద్దతిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ చేయటానికి రంగం సిద్ధమైనట్లు అనుమానాలు మొదలయ్యాయి.
  • ఎందుకంటే, ‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైతేనే బాధ్యతతోను, జవాబుదారీతనంతోను పనిచేస్తారు’....
  • .‘భవిష్యత్తులో భర్తీ చేసే ఉద్యోగాలన్నీ ఔట్ సోర్సింగ్ విధానంలోనే చేస్తాం’  అని తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు మొదలయ్యాయి.
Andhra doing  away with permanent job  recruitment in favor of outsourcing

‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్న టిడిపి ఎన్నికల నినాదానికి అర్ధం అందరికీ ఇప్పుడే అర్ధమవుతోంది. తెలుగుయువత, టిడిపిలోని యువతను ఔట్ సోర్సింగ్ పద్దతిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ చేయటానికి రంగం సిద్ధమైనట్లు అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైతేనే బాధ్యతతోను, జవాబుదారీతనంతోను పనిచేస్తారు’.....‘భవిష్యత్తులో భర్తీ చేసే ఉద్యోగాలన్నీ ఔట్ సోర్సింగ్ విధానంలోనే చేస్తాం’  అని తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు మొదలయ్యాయి.

శనివారం ఉదయం నుండి విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పారిశుధ్యం, సుందరీకరణ తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఔట్ సోర్సింగ్ విధానంలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రకటించారు. అంటే పోయిన ఎన్నికల్లో ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్న టిడిపి నినాదానికి అర్ధం ఇదేనన్నమాట. టిడిపి యువత, టిడిపి నేతలకు కావాల్సిన వాళ్ళకు ఇక ఉద్యోగాల పండగే.

గడచిన మూడున్నరేళ్ళుగా పెద్దగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది లేదు. నిరుద్యోగులు ఎంత ఆందోళన చేస్తున్నా చంద్రబాబు లెక్క చేయటం లేదు. ఐటి రంగం అన్నారు, ఫ్యాక్టరీలన్నారు..ఏమేమో చెప్పారు. లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని అరచేతిలోనే వైకుంఠం చూపించేస్తున్నారు అందరికీ. పోని మొన్నటి ఎన్నికల్లో చెప్పినట్లుగా నిరుద్యోగ భృతి అన్నా ఇచ్చారా అంటే అదీ లేదు. దాంతో ఉద్యోగాల భర్తీ లేక అటు నిరుద్యోగభృతి అందక చాలామంది అల్లాడిపోతున్నారు.

ఇటువంటి పరిస్ధితిలోనే నారా లోకేష్ లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంటూ ఆమధ్య నంద్యాలలో నోరుజారి తల బొప్పి కట్టించుకున్నారు. సరే, ప్రస్తుతానికొస్తే ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాలన్నీ కూడా ఔట్ సోర్సింగ్ విధానంలోనే ఉంటాయని చంద్రబాబు చల్లగా చెప్పారు. ఆసుపత్రులు, యూనివర్సిటీలు, ఎండోమెంట్స్ తదితర విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెబుతున్నారు.

అంటే, వచ్చే ఎన్నికల్లోగా వీలైనంత మంది ‘పచ్చ బ్యాచ్’ ను ప్రభుత్వ కొలువుల్లో నింపేస్తారన్న మాట. అదేవిధంగా, నిరుద్యోగ భృతిని కూడా డిసెంబర్ నుండి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. బహుశా నిరుద్యోగ భృతిలో కూడా సింహభాగం ముందు ‘తమ్ముళ్ళ’కే అందినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios