అమరావతి:జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకొనే విషయం తనకు తెలియదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.ఎవరైనా మాతో కలవొచ్చు.. చివరి నిమిషం వవరకు ఏదైనా జరగొచ్చని జేసీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

గురువారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని చెప్పారు. ఎవరైనా మాతో కలవొచ్చు.. చివరి నిమిషం వవరకు ఏదైనా జరగొచ్చని జేసీ చెప్పారు.

సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్షలు చేయడం వల్ల  ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఏదో ప్రయత్నం చేయాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని  ఆయన చెప్పారు.