Asianet News TeluguAsianet News Telugu

చెప్పుల్లేకుండా మండుటెండలో కలెక్టర్ మట్టి పని

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పులు వేసుకోకుండా మండుటెండల్లో మట్టి పనిచేశారు. గడ్డపార పట్టి మట్టిని తవ్వారు. ఉపాధి హామీ కూలీల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

Ananthapur collector Chandrudu does physical work
Author
ananthapur, First Published Mar 24, 2021, 6:35 PM IST

అనంతపురం: చెప్పులు లేకుండా మండుటెండలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంథం చంద్రుడు మట్టిపని చేశారు. గడ్డపార తీసుకుని మట్టిని తవ్వారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మజ్జిగ పంపిణీ  చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన ఆత్మకూరు మండలంలోని వడ్డుపల్లి గ్రామం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంలోనే ఆయన చెప్పులు వేసుకోకుండా మండుటెండలో గడ్డపార చేతపట్టి మట్టి తవ్వతూ కూలీల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. కలెక్టర్‌ రోజు పనులు కల్పిస్తున్నారా..? క్రమం తప్పకుండా డబ్బులు అందుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. తాము అడిగిన వెంటనే అధికారులు పనులు కల్పిస్తున్నారని, ఈ రోజు (మంగళవారం) రూ.234పైగా కూలి పడిందని కూలీలు తెలిపారు. దాంతో కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

అక్కడే ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామాంజనేయులును అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనులు చేసే ప్రాంతాల్లో కోవిడ్‌ నిబంధనలన్నీ పాటించేలా చూడాలన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 2.66 కోట్ల మంది కూలీలకు ఉపాధి హామీ కింద పనులు కల్పించామన్నారు.

 రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వేతనం కూలీలకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, ఏపీడీ నీలిమారెడ్డి, ఎంపీడీఓ రామాంజనేయులు, ఏపీఓ సుజాత పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios