జెసి మాట్లాడుతూ, ఎవరినైనా సరే ‘చంద్రబాబు వాడుకుని వదిలేస్తారం’టూ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీసింది. చంద్రబాబు ‘ఎవరినైనా సరే కూరల్లో కరివేపాకులాగ వాడుకుని వదిలేస్తారం’టూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
అనంతపురం టిడిపి పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఆవేశంలో ఒక్కోసారి నిజాలు కక్కేస్తారు. చంద్రబాబునాయుడుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాయదుర్గంలో జెసి మాట్లాడుతూ, ఎవరినైనా సరే ‘చంద్రబాబు వాడుకుని వదిలేస్తారం’టూ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీసింది. చంద్రబాబు ‘ఎవరినైనా సరే కూరల్లో కరివేపాకులాగ వాడుకుని వదిలేస్తారం’టూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
తనపై ఉన్న అప్రతిష్టను తొలగించుకునేందుకే తన అల్లుడు దీపక్ రెడ్డికి ఎంఎల్సీ ఇచ్చినట్లు కూడా చెప్పుకొచ్చారు.దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు రాయదుర్గంలో ఆదివారం ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. అక్కడ జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యలు చేశారు.
అక్కడితో ఆగితే ఆయన జెసి ఎందుకవుతారు? ‘చంద్రబాబుకున్నంత ఆశ దేశంలో ఇంకెవరికీ లేద’ని కూడా అన్నారు. రాజకీయాల్లో డబ్బుకే ప్రాధాన్యమన్నారు.
ఒకవైపు ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తొలగించాలని చంద్రబాబు చెబుతూంటే, ఇంకోవైపు జెసి డబ్బు ప్రభావం గురించి నిజాలు చెప్పటం గమనార్హం. పైగా ప్రజల జేబుల్లో చేతులు పెట్టకూడదని, అలా అలవాటు చేసుకుంటే వారి రాజకీయ జీవితం ముగిసినట్లేనని చెప్పటం కొసమెరుపు.
