Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుండే ఆనందయ్య మందు పంపిణీ: కృష్ణపట్టణంలో 144 సెక్షన్

ఆనందయ్య మందు పంపిణీ సోమవారం నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కృష్ణపట్టణం నియోజకవర్గానికి చెందిన  ప్రజలకు  ఈ మందును అందించనున్నారు. 
 

Anandayya medicine distribution begins from june 7 lns
Author
nellore, First Published Jun 6, 2021, 9:31 AM IST

నెల్లూరు: ఆనందయ్య మందు పంపిణీ సోమవారం నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కృష్ణపట్టణం నియోజకవర్గానికి చెందిన  ప్రజలకు  ఈ మందును అందించనున్నారు. ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయి  రెండు వారాలు దాటింది.

also read: ఉఫ్ అంటే ఎగిరిపోయే వాడివి.. నీ బతుకంతా మాకు తెలుసు: సోమిరెడ్డిపై కాకాని ఘాటు వ్యాఖ్యలు...

ఈ మందు పంపిణీ గురించి  ప్రజలు ఎదురు చూస్తున్నారు.  ఈ మందుపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.  మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని కూడ జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ తెలిపింది. దీంతో  మందు పంపిణీని ఆన్ లైన్ లో చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వెబ్‌సైట్ ను కూడ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత సర్వే పల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ మందును పంపిణీ చేయనున్నారు. ఆధార్ కార్డును పరిశీలించి మందును ఇవ్వనున్నారు. కృష్ణపట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. 

మందు తయారీ ప్రక్రియను ఆనందయ్య  ఇప్పటికే ప్రారంభించారు. అయితే మందును ఆన్‌లైన్ లో పంపిణీ చేస్తారా, నేరుగా రోగులు వస్తే అందిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి  అధికార విపక్ష పార్టీల మధ్య తీవ్ర విమర్శలు సాగుతున్నాయి. అధికార పార్టీపై మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు అధికార పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడ ధీటుగా సమాధానం ఇచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios