నెల్లూరు: కరోనా మహమ్మారి దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఈ  వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే అయ్యో పాపం అనడం తప్ప ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య మాత్రం తనకు తెలిసిన ఆయుర్వేదాన్ని ఉపయోగించి ఓ మందుకు కనుగొన్నాడు. ఈ మందు కరోనాను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందన్న వార్త తెలుగురాష్ట్రాల్లో ప్రచారం కావడంతో వేలాది మంది ప్రజలు ఆయన మందు కోసం బారులు తీరుతున్నారు. 

read more  హాట్ టాపిక్: కరోనాకు ఆనందయ్య ఆయుర్వేద మందు, వేలాదిగా ఎగబడుతున్న జనం

ఇప్పటివరకు హాస్పిటల్స్ వైద్యాన్ని నమ్ముకున్నవారు తాజాగా ఆనందయ్య అందించే మందుకోసం కరోనా రోగులు కృష్ణపట్నం దారిపట్టారు. చిన్న పట్టణమైన  కృష్ణపట్నంకు భారీగా వాహనాల రాక యొదలవడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో కరోనా పేషంట్స్ తో వచ్చిన అంబులెన్స్ లతో పాటు సాధారణ వాహనాలు ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఇదిలావుంటే ఆనందయ్య అందించే కరోనా మందుకోసం 50 నుంచి 60 వేలమంది జనం వస్తారని ఇంటలిజెన్స్ అంచనా వేస్తోంది. అయితే ఒకరోజు కేవలం 3వేల మందికి మాత్రమే మందు తయారు చేయగలమని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పరిసరాల్లో వేలమంది రోగులు వచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా జనాలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు.