మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఆయన టీడీపీనీ వీడి.. వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇది తెలిసిన విషయమే. అయితే.. తాజాగా.. ఆనం.. చంద్రబాబుకి ఓ కొరియర్ పంపారట. ఆ కొరియర్ లో ఏముందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి అడుగుపెట్టిన ఆనంకి.. పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదు. అందుకే పార్టీ మారిపోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరిన సందర్బంగా పార్టీ ఇచ్చిన ఐడీకార్డ్, పసుపు కండువాను తిరిగి తెలుగుగుదేశం పార్టీకి ఇచ్చేశారని విశ్వసనీయ సమాచారం.

ఈనెల 16 లేదా 18 న జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే వారంరోజుల కిందటే వైసీపీలో చేరాల్సిన ఆనం ఆషాడమాసం కారణంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే ఓ దఫా జగన్ తో చర్చలు జరిపిన అయన పార్టీలో చేరడానికి దాదాపు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి లేదా ఆత్మకూరు నియోజకవర్గంనుంచి అయన పోటీ చేసే అవకాశముంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయన కూడా వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నారు