అధికార వైసీపీకి నెల్లూరు జిల్లాలో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యారెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆమె నారా లోకేష్‌ను కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికార వైసీపీకి నెల్లూరు జిల్లాలో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యారెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కైవల్యారెడ్డి, ఆమె భర్త రితీష్ టీడీపీ నేత నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఆమె త్వరలోనే టీడీపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీలో చేరాలని కైవల్యారెడ్డి నిర్ణయం తీసుకున్నారని.. ఈ క్రమంలోనే లోకేష్‌ను కలిసి చర్చలు జరిపారని సమాచారం. టీడీపీ తరఫున కైవల్యారెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ టికెట్‌ను కైవల్యా రెడ్డి ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె లోకేష్ వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం.
ప్రస్తుతం కైవల్యా రెడ్డి తండ్రి రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు అయితే కైవల్యా అత్తగారి ఊరు బద్వేలు నియోజకవర్గంలో ఉంది. బద్వేలు టీడీపీ మహిళా నేత విజయమ్మకు కైవల్యా రెడ్డి కోడలు. అయితే తండ్రి వైసీపీలో ఉండటం.. కైవల్యా టీడీపీ చేరాలని చూడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఆనం రామనారాయణ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
