చంద్రబాబుపై అసంతృప్తి: జగన్ వైపు ఆనం చూపు

First Published 3, Jun 2018, 2:04 PM IST
Anam Narayana Reddy unhappy with TDP
Highlights

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పట్ల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జీ ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

నెల్లూరు: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పట్ల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జీ ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

ఆ ప్రచారాన్ని ఆనం నారాయణ రెడ్డి ఖండించడం లేదు. ఇటీవల మినీ మహానాడులో పార్టీ మీద, పార్టీ నేతల మీద అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రభావం శనివారం జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం మీద కూడా పడింది.
 
ఈ కార్యక్రమానికి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో ఉండి కూడా హాజరు కాలేదు. దాంతో నవనిర్మాణ దీక్ష పెద్దగా జరగలేదు.  తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం చోటు చేసుకుంది. 

loader