భూమన కరుణాకర్ రెడ్డి  రాయభారం

నెల్లూరు పెద్ద రెడ్లు ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామ్ నారయణ్ రెడ్డి చివరకు వైసిపి లో తలదాచుకోబోతున్నారు.

ఇప్పటికందిన సమాచారం ప్రకారం : ఇంతకాలం ప్రతిపక్ష నాయకుడు జగన్ ని తెలుగుదేశం వాళ్లకంటే ఎక్కు వ తిట్టినందుకు చెంపలేసుకుని తెలుగుదేశానికి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలొస్తున్నాయి.

జరిగిందేదో జరిగిపోయింది, ఇక చాలు, వైసిసిలోకి రండి అని పార్టీనేత భూమన కరుణా కర్ రెడ్డి దౌత్యం నెరపినట్లు సమాచారం.

ఎంత గొంతుచించుకున్నా, రోడ్డెక్కి చంద్రబాబునాయుడిని ఎంత సమర్థించినా ఆశించిన ఫలితం రాక ఆనంబ్రదర్స్ అభాసు పాలయ్యారు.

చంద్రబాబుతోపాటు, ఇపుడు చిన్నబాబుకు సేవలందించడం వీరికి ఇబ్బందిగా ఉంది.

 చిన్న బాబు వచ్చినప్పటినుంచి వారి పరిస్థితి మరీదిగజారింది. చిన్నబాబు నెల్లూరు వస్తే ఎవరో కార్యకర్తలొచ్చి మీటింగ్ లకు రమ్మంటున్నారు.

అక్కటా, ఏమి ఈ పరిస్థితి.

ఇపుడు తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి అయ్యాక, ఇక ఇక్కడేముంటుందనే నిర్ణయానికి వారొచ్చినట్లు చెబుతున్నారు.

దీని ఫలితమే భూమన్ తో చర్చలు.

 రేపో మాపో వాళ్లే ఒకప్రకటన చేయవచ్చని నెల్లూరు నుంచి సమాచారం అందుతున్నది.