ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అడారీ ఆనంద్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి .. వైసీపీలోకి చేరనున్నారు.

విశాఖ డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుమారుడే ఆనంద్.. ఈయన డైరీ అనుబంధ కృషి ట్రస్ట్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆనంద్‌తో పాటు 12 మంది విశాఖ డైరీ డైరెక్టర్లు, యలమంచిలి మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారితో పాటు పలువురు టీడీపీ నేతలు వైసీపీ గూటికి చేరనున్నారు.

సెప్టెంబర్ 1న విజయవాడలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆనంద్ వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. వీరి చేరికతో సుమారు మూడు దశాబ్ధాలుగా టీడీపీ చేతిలో ఉన్న విశాఖ డైరీ ఇప్పుడు వైసీపీ గ్రిప్‌లోకి వెళ్తున్నట్లే.

కాగా.. ఉత్తరాంధ్రలోని పాల సొసైటీలలో అత్యధికం టీడీపీ సానుభూతిపరుల చెప్పుచేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వైసీపీలో విలీనం కాబోతున్నట్లే.