ATA News; అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధుల బృందం గురువారం  ముఖ్యమంత్రి జగన్​ను కలిసింది.  అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జులై 1 నుంచి 3 వరకు జరగనున్న ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలని జగన్​ను ఆహ్వానించింది.  

ATA News; అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్‌డీసిలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న 17వ ఆటా మహసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ వేడుకలకోసం ఇప్పటికే ఏర్పాట్లను పెద్దఎత్తున చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) తెలుగు మహాసభల ఆహ్వానం అందింది.

గురువారం నాడు ఆటా ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి ఆటా తెలుగు మహాసభలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ని కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్‌ కమిటీ ఛైర్మన్‌ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ చల్లా ఉన్నారు.

తెలుగు భాషా, సంస్కృతి, సాంప్ర‌దాయాలు, పండుగ‌ల‌ను వేడుక‌ల‌ను అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ అమెరికాలో నిర్వ‌హిస్తోంది. ఈ సంస్థ‌ 1990లో స్థాపించ‌బడింది. ఈ సంస్థ సంవ‌త‌ర్సం ఎన్నో వేడుక‌లు, సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.