విజయవాడ : అమెరికా కాన్సుల్ ప్రతినిధుల బృందం ఏపీ రాజభవన్ లో హల్ చల్ చేశారు. బుధవారం రాజభవన్ లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరించందన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమెరికా కాన్సుల్‌ జనరల్‌ రీఫ్‌మెన్ తోపాటు పలువురు సభ్యులు బీబీ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఇరు దేశాల్లోని గవర్నర్‌ వ్యవస్థలపై కాన్సుల్‌ సభ్యులు, గవర్నర్‌ ల మధ్య ఆసక్తికర చర్చ కొనసాగింది. అమెరికాలోని గవర్నర్‌ వ్యవస్థకు ఇక్కడి వ్యవస్థకు అసలు సంబంధం లేదని గవర్నర్ బీబీ హరిచందన్ తెలిపారు.  

నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తగిన రీతిలో సహకరించాలని కాన్సుల్‌ సభ్యులకు సూచించారు. తమ పరిధిలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఒడిషా కూడా ఉన్నాయని కాన్సుల్‌​ జనరల్‌ గవర్నర్‌కు వివరించారు.