టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల వైసీపీలో చేరి.. రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు . ఈ నేపథ్యంలో అంబటి రాయుడు వైసీపీని వీడటంపై వివరణ ఇచ్చారు. తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల వైసీపీలో చేరి.. రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇది రాజకీయంగా వైసీపీని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది. జగన్ తీరు నచ్చకే రాయుడు ఆ పార్టీని వీడారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు వైసీపీని వీడటంపై వివరణ ఇచ్చారు. తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నానని.. త్వరలో దుబాయ్ వేదికగా జరగనున్న ఐఎల్ టీ 20లో పాల్గొంటున్నట్లు అంబటి రాయుడు వెల్లడించారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ 20లో రాయుడుకు చోటు దక్కింది. అలాగే ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృత్తిపరంగా క్రికెట్ ఆడుతున్నందున రాజకీయాల్లో వుండటం భావ్యం కాదనే ఉద్దేశంతో వైసీపీని వీడినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. రాయుడు ట్వీట్‌తో ఇప్పుడు అసలు విషయం తేలినట్లయ్యింది. దీని సాయంతో వైసీపీ ఇప్పుడు విపక్షాలపై ఎదురుదాడికి దిగే అవకాశం వుంది. 

Scroll to load tweet…

గతేడాది ఐపీఎల్‌కు అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు. రాజకీయాలపై ఆసక్తితో ఆయన సీఎం జగన్‌కు సానుకూలంగా ట్వీట్లు చేస్తూ వచ్చాడు. అదే క్రమంలో ఆయన సీఎం జగన్‌ ను కలిశారు. దాదాపుగా ఆయన వైసీపీలో చేరిపోతున్నాడని అప్పుడే తెలిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తృత పర్యటన చేశాడు. స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు.