Asianet News TeluguAsianet News Telugu

చనిపోవాలనుకున్న వ్యక్తి ధైర్యవంతుడా..? రాజ్యసభ సీటు ఇవ్వలేదని బయటికొచ్చారా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. నాలుగేళ్లపాటు టీడీపీతో కలిసి కాపురం చేసి.. ఇప్పుడు టీడీపీని వదిలి.. వైసీపీని విమర్శిస్తున్నారని ఆరోపించారు

Ambati rambabu comments on pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. నాలుగేళ్లపాటు టీడీపీతో కలిసి కాపురం చేసి.. ఇప్పుడు టీడీపీని వదిలి.. వైసీపీని విమర్శిస్తున్నారని ఆరోపించారు.. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నన్ని సీట్లు తనకు ఉండుంటే... ఒక ఊపు వూపేవాడినని పవన్ 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు..  చంద్రబాబు రాజ్యసభ సీటు ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చారా..? అన్ని ఎద్దేవా చేశారు.

రివాల్వార్‌తో కాల్చుకుని చనిపోదామనుకుని.. జీవితంలో పోరాడలేకపోయిన వ్యక్తిని ఎవరైనా ధైర్యవంతుడు అంటారా..? అన్ని అంబటి ప్రశ్నించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ ఎందుకు పోటీ చేయలేదని... 18 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఏం చేశారు..? ప్రశ్నించడానికి పార్టీ పెట్టి ఎందుకు ప్రశ్నించలేదు.

ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబుకు ఎందుకు మద్ధతు పలికారో ప్రజలకు చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఓ రాజకీయ నాయకుడిగా ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని తెలిపారు.. పవన్ తన నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios