హైదరాబాద్: అమరావతి భూకుంభకోణానికి సంబంధించిన విషయాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు తాము యజమానులమంటూ నిరుపేద రైతులు చూపిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఇందుకు సంబంధించి సీఐడీ దర్యాప్తు కూడా చేసింది.

అమరావతిలో 796 తెల్ల రేషన్ కార్డుల హోల్డర్లు, నెలసరి ఆదాయం రూ. 5 వేలకు మించినలేని వారు 2014, 2015ల్లో రూ.220 కోట్ల విలువ చేసే భూములు కొన్నట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ వ్యవహారాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ సీఐడి ఆదాయం పన్ను (ఐటి) శాఖకు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాసింది. 

అమరావతి భూముల కొనుగోలుపై సీఐడి కేసు నమోదు చేసింది.ల్యాండ్ పూలింగ్‌పై సీఐడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. సీఐడీ 796 తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్‌పై కేసు నమోదు చేసింది. రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమిని తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు కొనుగోలు చే చేసినట్లు తేలింది. తెల్లరేషన్ కార్డు హోల్డర్స్రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు సీఐడి గుర్తించింది.

తెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో కొనుగోలు చేయించిన వారి వివరాలపై సిఐడి ఆరా తీస్తోంది. దానిపై విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. అమరావతి గ్రామాల్లో 131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ మొత్తం 129 ఎకరాలు కొన్నట్లు గుర్తించారు. పెద్దకాకానిలో 43 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు 40 ఎకరాలు కొన్నారు.తాడికొండలో 188 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్లు 180 ఎకరాలు కొన్నట్లు తేలింది. 

తుళ్లూరులో 238 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్లు 243 ఎకరాలు కొన్నారు. మంగళగిరిలో 148 మంది తెల్లరేషన్ కార్డుహోల్డర్లు 133 ఎకరాలు కొన్నారు. తాడేపల్లిలో 49 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు 24 ఎకరాలు కొన్నారు.