చిరంజీవి ఇంటి ముట్టడిపై జేఏసీ వివరణ ఇదీ: ఖబడ్దార్ అంటూ మెగా ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపు ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై అమరావతి జేఏసీ స్పందించింది. దానిపై వివరణ ఇచ్చింది. కాగా, మెగాఫ్యాన్స్ చిరంజీవి నివాసానికి పెద్ద యెత్తున చేరుకుంటున్నారు.
హైదరాబాద్: మెగాస్టార్, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇంటిని ముట్టడికి ఇచ్చిన పిలుపుపై అమరావతి జేఎసీ స్పష్టత ఇచ్చింది. చిరంజీవి ఇంటి ముట్టడికి అమరావతి జేఎసీ పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే, చిరంజీవి ఇంటి ముట్టడికి తాము ఏ విధమైన పిలుపు ఇవ్వలేదని అమరావతి జేఏసీ స్పష్టం చేసింది. తాము పోస్టర్లు వేయలేదని చెప్పింది. అలా చేసినవాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని చెప్పింది.
Also Read: అమరావతి సెగ.. చిరంజీవి నివాసం వద్ద భారీ భద్రత
చిరంజీవి ఇంటి వద్దకు పెద్ద యెత్తున మెగా ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. చిరంజీవి ఇంటిని ముట్టడిస్తే ఖబడ్దార్ అంటూ మెగా అభిమానులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటి వద్ద తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి జైకొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటి ముట్టడికి అమరావతి జేఎసీ పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండగా ఆయన సమర్థిస్తున్నారు.