Asianet News TeluguAsianet News Telugu

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్..

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది.

AMaravati Inner ring road Case Nara Lokesh Named as A14 ksm
Author
First Published Sep 26, 2023, 11:54 AM IST

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక, ఈ కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. 

ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ,  నారా లోకేష్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్‌కె హౌసింగ్ లిమిటెడ్‌కి చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామ కృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రై. లిమిటెడ్‌లతో పాటు ఇతరులను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్), సీడ్ క్యాపిటల్‌ల అలైన్‌మెంట్‌లను ఉద్దేశపూర్వకంగా, గణించిన పద్ధతిలో నారాయణ గ్రూప్ సంస్థలకు అనవసరమైన సంపదను అందించేందుకు చంద్రబాబు నాయుడు, నారాయణ కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios