Asianet News TeluguAsianet News Telugu

పవనన్నా, ఎక్కడ? వచ్చి ఆదుకో ప్లీజ్: పెనుమాక రైతుల పూజలు

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. తమ భూములు కాపాడాలని  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను రైతులు  ప్రార్థిస్తున్నారు. పవన్ తమ వూరికి వచ్చి  రైతులకు అండగా ఉండి న్యాయం చేయాలని కోరుతూ పవన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. 

Amaravati farmers perform Puja to pawan poster to protect their lands

అమరావతి క్యాపిటల్ ప్రాంతంలో రైతులు ప్రభుత్వానికి ఒక వినూత్న నిరసన తెలిపారు.

 

క్యాపిటల్ ప్రాంతంలో తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు.ల్యాండ్ పూలింగ్ మాట వినని రైతుల మీద భూసేకరణప్రయోగించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది.దీనితో ఈ గ్రామరైతులు భూముల కోల్పోయే పరిస్థితి వచ్చింది.ఈ సమయంలో తమ కు అండగా ఉండాలని వారు జనసేన నేత పవన్ కల్యాణ్ నుకోరారు.

 

ఈ కోర్కెను వారు ఒక వినూత్నపద్థతిలో వ్యక్తం చేశారు.

 

తమ భూములు కాపాడేందుకు   జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  పెనుమాక తరలి  వచ్చి  రైతులకు అండగా ఉండి న్యాయం చేయాలని  కోరుతూ పవన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. 

Amaravati farmers perform Puja to pawan poster to protect their lands

రాజధాని ప్రాంతరైతులు ఇలా పవన్ ని నమ్ముకోవడం కొత్త కాదు. పవన్ ఈ ప్రాంతాలను సందర్శించాకే అక్కడి భూసేకరణని గత ఏడాది ప్రభుత్వం వాయిదా వేసింది.  అయితే, ఇపుడు మళ్లీ మొదలయింది. భూసేకరణ జరుగుతుందన్న సమాచారం రాగానే రైతులు పవన్ బొమ్మ ఇలా ప్రయోగిస్తారు. గతంలో  భూసేకరణ పరిధిలోకి వచ్చే భూములన్నింటిలో కాలుపెడితే పవన్ వస్తాడు కాళ్లిరగ్గొడతాడనే  అర్థంలో పవన్ పోస్టర్లు (పై ఫోటో) ను ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ పోస్టర్ పెడితే అధికారులు తమ భూములను సేకరించరనే ది అర్థం. 

 

ఇది పవన్ కల్యాణ్ తీసిన గబ్బర్ సింగ్ సినిమానుంచి రైతులు  ఈ పద్ధతి  తీసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో మొండిబకాయీలను వసులుచేసేందుకు తన ఫోటో వాడుకోమని వపన్ బ్రహ్మానందానికి చెబుతాడు. ఇదే పద్ధతిలో నే 2016లోనే రైతులు తమ పోలాలో పవన్ కల్యాణ్ పోస్టర్లను పాతారు. ఇది పవన్ కాపలా ఉన్న భూమి,బలవంతపు  భూసేకరణకు వీలులేదు అని చెప్పడానిక వారిలా చేశారు. ఇలా పెనుమాకలో 300 మంది రైతులు 150 బ్యానర్లని పొలాల్లో పాతారు.

 

ఇంతవరకు పవన్ వల్లే భూసేకరణ ఆగిందని వారి నమ్మకం.

 

ఇపుడు మళ్లీ వపన్ వస్తే భూసేకరణ ఆగుతుందని వారు పూజచేస్తున్నారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios