బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ (బిఎస్ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం ముంబై చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిఎస్ఈ సిఈవో ఆశిష్ కుమార్ తో కలిసి అమరావతి బాండ్ల లిస్టింగ్ ను ప్రారంభించారు.

ముంబై: బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ (బిఎస్ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం ముంబై చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిఎస్ఈ సిఈవో ఆశిష్ కుమార్ తో కలిసి అమరావతి బాండ్ల లిస్టింగ్ ను ప్రారంభించారు. 

రాజధాని బాండ్ల లిస్టింగ్ మంచి పరిణామమని ఆశిష్ కుమార్ అన్నారు. అమరావతి బాండ్ల అమ్మకాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభమయ్యాయి. గంటలోనే 2 వేల కోట్లు ఆర్జించాయని ఆయన చెప్పారు. 

చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, సిఆర్డిఎ అధికారులు ముంబై చేరుకున్నారు. ముంబైలో చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.

టాటా, అంబానీ, బిర్లా, గోద్రెజ్‌, మహీంద్రా, గోయెంకా, లోథాలు చంద్రబాబుతో సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. 

ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో అమరావతి బాండ్లకు భారీ గిరాకీ