తుళ్లూరు: విజయవాడు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు రాజధాని రైతులకు దీక్షలో సరదా సన్నివేశం చోటు చేసుకొంది. సోమవారం నాడు విజయవాడలో దీక్షకు దిగాడు. ఈ దీక్షలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

Also read:జగన్ దూకుడు: బాబుకు ఇలా చెక్, వ్యూహమిదీ...

గద్దె రామ్మోహన్ రావు దీక్షలో పాల్గొన్న చంద్రబాబునాయుడు ఓ మహిళ వింత కోరిక కోరింది. గద్దె రామ్మోహన్ రావు దీక్షలో స్థానికంగా ఉండే వివాహిత నాగలక్ష్మి పాల్గొన్నారు. 

తనకు మూడు రోజులుగా నిద్ర పట్టడడం లేదన్నారు. రాజధానిని  తరలించడంపై తాను ఆందోళన చెందుతున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా చంద్రబాబుకు గుర్తు చేశారు.

తాను ఇప్పటివరకు తన భర్తకు చెప్పకుండా గడప దాటలేదన్నారు. తన భర్త ఆపీసుకు వెళ్లిన తర్వాత మనసు ఉండబట్టలేక తాను ఈ దీక్షలో పాల్గొనేందుకు వచ్చినట్టుగా ఆమె చెప్పారు. 

తన భర్తకు చెప్పకుండా ఇక్కడకు వచ్చినందుకు గాను తనను ఏమీ అనకుండా ఉండాలని తన భర్తకు సర్ధిచెప్పాలని చంద్రబాబునాయుడును నాగలక్ష్మి కోరారు. దీంతో చంద్రబాబునాయుడు ఆ బాధ్యతను తీసుకొన్నారు.

నాగలక్ష్మి భర్త చంద్రశేఖర్‌కు చంద్రబాబునాయుడు ఈ సభ వేదిక నుండే ఫోన్ చేశాడు. చంద్రశేఖర్‌కు అసలు విషయాన్ని వివరించాడు.రాజధానికి అనుకూలంగా సాగుతున్న దీక్షలో నాగలక్ష్మి పాల్గొన్న విషయాన్ని చంద్రబాబునాయుడు చెప్పారు.

మీకు చెప్పకుండా ఈ దీక్ష శిబిరంలో పాల్గొన్న విషయాన్ని చంద్రబాబునాయుడు చంద్రశేఖర్‌కు చెప్పారు. అంతేకాదు ఈ దీక్షలో పాల్గొన్నందుకు ఏమీ అనకూడదని చంద్రబాబునాయుడు చంద్రశేఖర్‌ను కోరాడు.

మీకు చెప్పకుండా  ఇంతవరకు నాగలక్ష్మి గడప దాటని విషయాన్ని దీక్షలో ప్రకటించిందని చంద్రబాబునాయుడు చెప్పారు. మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాగలక్ష్మిని ఏమీ అనవద్దని చంద్రబాబునాయుడు చంద్రశేఖర్‌ను కోరారు.

ఆ తర్వాత రాజధాని దీక్షకు మద్దతుగా  నాగలక్ష్మి తన చేతికి ఉన్న ఉంగరాన్ని విరాళంగా ఇచ్చింది. భయం భయంగానే దీక్షకు వచ్చిన నాగలక్ష్మి ఉంగరం విరాళంగా ఇవ్వడంతో చంద్రబాబునాయుడు ఆమెను అభినందించారు.