న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు సినీహీరోయిన్, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ ను తాను ఫాలో అవుతూ ఉండేదానినని చెప్పుకొచ్చారు.

ఓమీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆమె దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా వైయస్ జగన్ కు మంచి పేరు ఉందన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి జగన్ ఎన్నో కష్టాలుపడ్డారని తెలిపారు. వాటన్నింటిని గమనిస్తూ ఉండేదానినని చెప్పుకొచ్చారు. 

తాను కొత్తగా లోక్ సభకు ఎన్నికయ్యానని తెలిపారు. ప్రజలు ఏ నమ్మకంతో తనను గెలిపించారో వాటిని నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. లోక్ సభకు కొత్తగా ఎన్నికైనప్పటికీ ఇప్పటికే నాలుగు అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. చాలామంది కొత్త ఎంపీలా లేవని అంటున్నారని నవనీత్ కౌర్ తెలిపారు.