తెలుగుదేశం పార్టీని వీడేందుకు మరో ఎంపీ సిద్ధమయ్యారు.. గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అమలాపురం నుంచి మరోసారి పోటీ చేసేందుకు ఈయన సిద్ధమైనప్పటికీ.. టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో పండుల వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

దీనిలో భాగంగా సోమవారం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రవీంద్రబాబు సమావేశం కానున్నారు. జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించిన పక్షంలో నేడో, రేపో పండుల టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు.