అమలాపురం: మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేసిన వారికి బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను జగన్  సప్లయ్ చేశారని  అమలాపురం ఎంపీ  హర్షకుమార్ ఆరోపించారు.

 హర్షకుమార్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు  తనను జైల్లో పెట్టి జగన్ ఏం సాధించాలనుకొన్నాడో చెప్పాలని  హర్షకుమార్ ప్రశ్నించారు. తాను జైలులో ఉన్న సమయంలో తనను పరామర్శించిన వారికి  ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Also read:48 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ హర్షకుమార్

అమలాపురంలో జ్యూడీషీయల్ విధులకు ఆటంకం కల్గించారని మాజీ ఎంపీ హర్షకుమార్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో 48 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన హర్షకుమార్‌ అరెస్టు అయ్యారు. 

ఈ కేసులో ఆయన ఈ  నెల 29వ తేదీన జైలు నుండి విడుదలయ్యారు.జైలు నుండి విడుదలైన తర్వాత హర్షకుమార్  శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై ఈ వ్యాఖ్యలు చేశారు.  ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు.