ఆమదాలవలస అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

ఆంధ్ర ప్రదేశ్ లో మామా అల్లుళ్ల మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతున్న నియోజకవర్గం ఆమదాలవలస. ఇక్కడినుండి ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మేనల్లుడు కూన రవికుమార్ ను టిడిపి బరిలోకి దింపింది. ఆమదాలవలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మామా అల్లుడు ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో ఈ అసెంబ్లీ రిజల్ట్ పై ఉత్కంఠ నెలకొంది. 

Amadalavalasa assembly elections result 2024 RMA

ఆమదాలవసల నియోజకవర్గ రాజకీయాలు :

ఆమదాలవలస అసెంబ్లీ నుండి తమ్మినేని సీతారం అటు టిడిపి, ఇటు వైసిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలోనే ఆ పార్టీలో చేరిన తమ్మినేని 1983, 1985 ఎన్నికల్లో గెలిచారు. అలాగే 1994, 1999 ఎన్నికల్లో మరోసారి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అయితే 2009 లొ ప్రజారాజ్యం, 2014 లో వైసిపి తరపున పోటీచేసి ఓడిన తమ్మినేని 2019లో మాత్రం గెలిచారు. దీంతో ఆయనను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా నియమితులయ్యారు.  

తమ్మినేని సీతారాం టిడిపిని వీడటంతో ఆయన మేనల్లుడు  కూన రవికుమార్ ఆమదాలవలసపై కన్నేసారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూన 2019 లొ మామ చేతిలో ఓడిపోయారు. 

 ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. పొందూరు
2. ఆమదాలవలస
3.  సరుబుజ్జిలి
4.  బూర్జ

ఆమదాలవలస అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  1,89,677
పురుషులు -    96,129
మహిళలు ‌-    93,502

ఆమదాలవలస అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ఆమదాలవలస బరిలో మరోసారి తమ్మినేని సీతారాం నిలిచారు. 2019లో ఇదే నియోజకవర్గం నుండి గెలిచిన ఆయన స్పీకర్ పదవిని పొందారు. ఆమదాలవలసపై తమ్మినేనికి మంచి పట్టుంది. 

 టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ కూన రవికుమార్ ను ఆమదాలవలస పోటీలో నిలిపింది. ఈయన తమ్మినేని మేనల్లుడే. 2014 లో  రవికుమార్ మామను ఓడించారు. 

ఆమదాలవలస అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఆమదాలవలస అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,47,415 (79 శాతం) 

వైసిపి - తమ్మినేని సీతారాం - 77,897 ఓట్లు (57 శాతం) - 13,911 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - కూన రవికుమార్  - 63,906 ఓట్లు (43 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - రామ్మోహన్ - 3,280 (2 శాతం)

ఆమదాలవలస అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,34,113 ఓట్లు (77 శాతం)

టిడిపి  - కూన రవికుమార్ - 65,233 (48 శాతం) - 5,449 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - తమ్మినేని సీతారాం - 59,784 (44 శాతం) - ఓటమి

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios