ఏపి నుండి రాజ్యసభకు నామినేషన్లు వేసిన ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. టిడిపి నుండి ఇద్దరు నామినేషన్లు వేయగా వైసిపి తరపున ఇద్దరు నామినేషన్లు వేశారు. టిడిపి తరపున సిఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ నామినేషన్లు వేశారు. వైసిపి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. కాకపోతే ముందు జాగ్రత్తగా వేమిరెడ్డి తరపున ఆయన భార్య మరో నామినేషన వేశారు. నామినేషన్ దాఖలు ముగిసే సమయానికి మూడు స్ధానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేయటంతో వారు ఏకగ్రీవమైనట్లే. కాకపోతే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేయల్సుంటుంది.