తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఉండవల్లి అనూషకు అప్పగిస్తున్నట్టు తన పేరిట ప్రచారం అవుతున్న ఓ లేఖపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. 

గుంటూరు: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఉండవల్లి అనూషకు అప్పగిస్తున్నట్టు తన పేరిట ప్రచారం అవుతున్న ఓ లేఖపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అది ఫేక్ లేఖ అని స్పష్టం చేశారు. కొన్ని ఫేక్ బతుకులు మారవంటూ మండిపడ్డారు. దమ్ములేని దద్దమ్మ జగన్ ఇకనైనా ఇలాంటివి చేయించడం ఆపేసి ప్రజల కోసం కష్టపడాలంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

"జగన్ గారూ, నన్ను ఇబ్బందిపెట్టేందుకు పడుతున్న కష్టంలో ఒక్క శాతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పెట్టినా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. అలాకాకుండా, నన్ను టార్గెట్ చేయడమే మీ లక్ష్యమైతే ఆల్ ది బెస్ట్!" అంటూ ట్వీట్ చేశారు. 

''ఫేక్ బతుకులు మారవు. వైఎస్ జగన్ వేసే 5 రూపాయిల చిల్లర కోసం సొంత తల్లి పై తప్పుడు పోస్ట్ పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయింది వైకాపా పేటిఎం బ్యాచ్. యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్ ఇలాంటి చెత్త పనులు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు'' అంటూ మరో ట్వీట్ ద్వారా తీవ్ర పదజాలంతో వైసిపి నాయకులు, కార్యకర్తలపై లోకేష్ మండిపడ్డారు. 

read more వైసిపి ఎమ్మెల్యేల ఆరోపణలపైనే సిబిఐ విచారణ...సిద్ధమా జగన్ రెడ్డి: చినరాజప్ప సవాల్

''వైఎస్ జగన్ గారి పాల‌న‌లో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఎంతోమందికి అండగా నిలిచిన ''ప్రజలే ముందు'' పరిష్కార వేదిక 1100 కాల్ సెంట‌ర్ ని నిర్వీర్యం చేసి కాంట్రాక్టు తన బంధువర్గానికి కట్టబెట్టారు. తమ కార్యకర్తల కోసం 2200 మందిని ఉద్యోగాల్లోంచి పీకేశారు'' అని లోకేష్ ఆరోపించారు. 

''వేయ‌గ‌లిగితే రంగు, అంటించ‌గ‌లిగితే స్టిక్క‌ర్‌, మార్చ‌గ‌లిగితే పేరు ఇదే జ‌గ‌న్ రెడ్డి ఏడాది పాల‌న‌. 1100 ని 1902గా మార్చారు. నిరుద్యోగ భృతి ఎత్తేసారు, కార్యకర్తలకు ఉద్యోగాల పేరుతో వేల‌మందిని రోడ్డున ప‌డేశారు'' అంటూ వరుస ట్వీట్ల ద్వారా వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై లోకేష్ విరుచుకుపడ్డారు.