తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును నెల్లూరులోని డీకే గవర్నమెంట్ మహిళా కళాశాలలో చేస్తారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవు తుంది.
కౌంటింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్–19 నెగెటివ్ రిపోర్ట్ చూపించాలని, లేదా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నట్లు చూపించినవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అత్యల్పంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్లు, సుళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది.
