విశాఖపట్నం: ప్రముఖ హాస్య నటుడు అలీ వివిధ పార్టీల నేతలతో దోబుచులాట ఆడుతున్నారు. తద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన నాయకులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీలకు అలీ, జనసేన నేతలు హాజరయ్యారు.
 
ఇటీవల అలీ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమేయ్యారు. చంద్రబాబుతో ఏకాంతంగా అరగంట పాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కూడా ఆయన కలిశారు. 

 గత నెల 28న విశాఖ  విమానాశ్రయంలో జగన్, అలీ కలుసుకున్నారు. అప్పటి నుంచి అలీ వైసిపిలో చేరుతారనే ప్రచారం జరిగింది.